తెలంగాణ పోరాట యోధుడు కొమురయ్యకు ఘన నివాళులు

తెలంగాణ పోరాట యోధుడు కొమురయ్యకు ఘన నివాళులు

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని, ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని బీబీనగర్ మండలం దొడ్డి కొమురయ్య కమిటీ అధ్యక్షుడు సోము రమేష్ కురుమ అన్నారు. కొమురయ్య 77వ వర్థంతి సందర్భంగా బీబీనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ కురుమ మాట్లాడుతూ భూమి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్య అమరుడయ్యాడన్నారు.

ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య కమిటీ గౌరవ అధ్యక్షుడు జాన సత్యనారాయణ కురుమ, ప్రధాన కార్యదర్శి గుదే శ్రీశైలం కురుమ, మాజీ కోఆప్షన్ సభ్యుడు మంగ అశోక కురుమ, కురుమ సంఘం మండల అధ్యక్షుడు సోమ ముత్యాలు కురుమ, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీర ఐలయ్య కురుమ, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి వీరబోయిన లక్ష్మీనారాయణ యాదవ్, మండల ఉపాధ్యక్షులు పర్వతం శ్రీశైలం యాదవ్, గొర్రెల మేకల పెంపకదారుల సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు జంగయ్య యాదవ్, మాజీ విజిలెన్స్ మెంబర్ మంచాల నరహరి గొల్ల, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.