జగిత్యాలలో ఇద్దరు దొంగలు అరెస్ట్ 

జగిత్యాలలో ఇద్దరు దొంగలు అరెస్ట్ 
  • 67,700 నగదు, 8 తులాల వెండి సీజ్

ముద్ర ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల పట్టణంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డిఎస్పి రఘు చందర్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోరుట్ల మండలం అల్లమయ  గుట్ట ప్రాంతానికి చెందిన విభూది శేఖర్, బుగ్గారం మండలం బిర్సానికి చెందిన గుమ్ముల వెంకటేష్ అనే పాత నేరస్తులు.. గతంలో ఆలయాల్లో చొరికి పాల్పడేవారు.

ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై వచ్చిన వీరు ఆలయాల్లో చోరికి పాల్పడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరకడం లేదని భావించి జగిత్యాల పట్టణం లోని ఏడు ఇళ్లలో  పాల్పడి పాల్పడి రూ .67, 700 నగదు, 6000 విలువచేసే 8 తులాల వెండిని అపహరించుకు వెళ్లారు. జగిత్యాల పట్టణంలోని చిన్న కెనాల్ వద్ద పట్టణ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా అగుపించగా వారి వద్ద సోదాల్ చేయగా నగదు తో పాటు వెండి లభించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు డిఎస్పి తెలిపారు.