International Yoga Day: సిద్దిపేటలో యోగా వాక్

International Yoga Day: సిద్దిపేటలో యోగా వాక్

21న జరిగే యోగా దినోత్సవం జయప్రదం చేయాలని కోరుతూ ప్రదర్శన
ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: సిద్దిపేటలో యోగా వాక్ నిర్వహించారు. పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో సోమవారం నాడు ఈ యోగా వాక్ జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనెల 21న జరగనున్న నేపథ్యంలో యోగా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు, అందరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను ఈ యోగ వాక్ నిర్వహించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానం నుంచి విక్టరీ చౌరస్తా, పాత బస్టాండ్, తిరిగి హైస్కూల్ మైదానం వరకు యోగ వాక్ జరిగింది. 

అనంతరం హై స్కూల్ మైదానంలో పతాంజలి యోగ సమితి సభ్యులు కొద్దిసేపు యోగ ఆసనాలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా పతాంజలి సభ్యులు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఈ నెల 21న యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పతాంజలి యోగ నిర్వాహకులు మనోహర్, ఆర్ట్ ఫుల్ నెస్ యోగా నిర్వాహకులు నగేష్, యువభారత్ అధ్యక్షులు మురళీకృష్ణ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు దండే ప్రభు, డాక్టర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.