ఆశ కార్యకర్తల మానవ హారం

ఆశ కార్యకర్తల మానవ హారం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె శనివారం ఆరో రోజుకు చేరింది. రాష్ట్ర ఆశల సంఘం  పిలుపు మేరకు నిర్మల్ లో సమ్మె చేస్తున్న ఆశ కార్యకర్తలు మానవ హారం గా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  ఆశల  సమస్యలు  పరిష్కరించాలని,   లేని పక్షంలో పోరాటం  ఉధృతం  చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్  గౌరవాధ్యక్షురాలు సుజాత, జిల్లా కోశాధికారి  రామలక్ష్మి,రాధా భార్గవి,సుధ, సంగీత,   అనురాధ, మంగ,లక్ష్మి, ఇంద్రజ   తదితరులు  పాల్గొన్నారు.