గ్రేటర్ లో కొండెక్కిన చికెన్ ధరలు

గ్రేటర్ లో కొండెక్కిన చికెన్ ధరలు

ముద్ర,హైదరాబాద్:- గ్రేటర్ హైదరాబాద్ లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధరలు గత వారం రూ. 250 నుంచి 280 వరకూ ఉండగా.. తాజాగా రూ. 300 లకు చేరింది. స్కిన్ తో రూ.260 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలో రూ.500కు పైగా విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టారీతిన ధరలను నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మండుతున్న ఎండల కారణంగా కోళ్ళ ఉత్పత్తి తగ్గిందని మరో రెండు నెలలు ఈ ధరలు ఉండనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.