జోరందుకున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం - నారాయణ గూడెం లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన సిపిఎం

జోరందుకున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం - నారాయణ గూడెం లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపిన సిపిఎం

మునగాల ముద్ర: మండల పరిధిలోని బరాకత్ గూడెం  కృష్ణానగర్ నారాయణ గూడెం గ్రామాలలో కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గడపగడపకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పథకాలను ప్రచారం చేస్తూ  రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన అన్ని గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఆమె అన్నారు . నారాయణ గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపి గ్రామంలో భారీ  ర్యాలీ నిర్వహించారు .కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎలక బిందు నరేందర్ రెడ్డి పందిరి నాగిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు జై పాల్ రెడ్డి సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్ కోటేశ్వరరావు నరేందర్ రెడ్డి జానకి రెడ్డి బోస్ శ్రీనివాస్ సిపిఎం నాయకులు కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు.