బైకుతో డి ఒకరి మృతి, బైకుతో పరారీ

బైకుతో డి ఒకరి మృతి, బైకుతో పరారీ

సమాచారం సేకరిస్తున్న పోలీసులు ముద్ర,ఎల్లారెడ్డిపేట : గుర్తు తెలువని బైకుతో ఢీకొని మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శివారులోని సత్యపీరిల దర్గా వద్ద మంగళవారం ఓ గుర్తు తెలువని బైకుతో మతిస్థిమితం లేని వ్యక్తిని గుద్ది పారిపోయాడని తెలిసింది. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన ప్రమాదం పట్ల ఆరా తీస్తున్నారు. వ్యక్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అదేవిధంగా బైకు కు సంబంధించిన వ్యక్తి ఎవరు అయి ఉంటారని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.