కొట్టిన్నర రూపాయల విలువ న్యూట్రేషన్ కిట్స్ పంపిణీ: ఎంపి బండి పార్థసారథి రెడ్డి | Mudra News

కొట్టిన్నర రూపాయల విలువ న్యూట్రేషన్ కిట్స్ పంపిణీ: ఎంపి బండి పార్థసారథి రెడ్డి | Mudra News

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: ప్రధాన మంత్రి పిలుపు మేరకు టీ. బీ. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి లో టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రేషన్ కిట్స్ ను  రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ 2025 కల్లా దేశంలో టీబీ వ్యాధి లేకుండా చేస్తామని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు తమ హేటిరో సంస్థ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని టీబీ వ్యాధిగ్రస్తుల కు మూడేళ్ల పాటు కొట్టిన్నర రూపాయల విలువ కలిగిన న్యూట్రేషన్ కిట్స్ ను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ హేటిరో సంస్థ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తున్న రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ రంగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేస్తుందన్నారు. నియోజకవర్గం లోని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిందని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖను ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమర్థవంతంగా నడుపుతున్నారని కొనియాడారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది చేసిన సేవలను సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు.


కార్యక్రమం లో ఉన్న తల్లాడ కు చెందిన ముగ్గురు టీబీ వ్యాధిగ్రస్తులైన చిన్నారుల పూర్తి విద్యకు కావల్సిన సహాయ సహకారాలను తమ సంస్థ ద్వారా అందిస్తానని  రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు