మునగాల మండలంలో నలమాద పద్మావతిరెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్

మునగాల మండలంలో నలమాద పద్మావతిరెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్

మునగాల ముద్ర: మునగాల మండలంలో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తంపద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి సోమవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ఉత్తం పద్మావతి రెడ్డి మునగాల మండలం లో ఎన్నికల పర్యటన నవంబర్ 21 మంగళవారం  మాధవరం లో ప్రారంభమై, ఈదులవాగు తండ, నేలమర్రి, వెంకట్రాంపురం, తాడువాయి, విజయ రాఘవపురం, సీతానగరం,రేపాల, నరసింహుల గూడెం,నవంబర్ 22 బుధవారం జగన్నాధపురం,కలకోవ, గణపవరం,తిమ్మారెడ్డి గూడెం, కొక్కిరేణి,బరాఖత్ గూడెం, ముకుందాపురం నవంబర్ 23 గురువారం  ఆకుపాముల,మునగాల మండల కేంద్రం, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు, ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ మూడు రోజుల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.