కారు గుర్తుకు వేసిన ఓటు రైతులు బీడు భూములను సస్యశ్యామలం చెసింది

కారు గుర్తుకు వేసిన ఓటు రైతులు బీడు భూములను సస్యశ్యామలం చెసింది
  • 25 ఏళ్ళ దామోదర్ రెడ్డి పాలన లో జరిగిన అభివృద్ది శూన్యం 
  • దామోదర్ రెడ్డి  మా గ్రామానికి ఈ  పని చేసిండని చెప్పే దమ్ము ఏ గ్రామ కాంగ్రెస్ నాయకుడికైనా ఉందా?
  • ముసలిపులి గాండ్రించుడు తప్పా చేసేది ఏమీ లేదు
  • జన బలం ముందు ఏ టైగర్ లు  నిలబడవు 
  • ఇసునూరు రామచంద్ర రెడ్డి వారసుడు దామోదర్ రెడ్డి అయితే నేను బి.ఎన్, ధర్మ బిక్షం వారసుడిని 
  • గర్జించుడు.. గాండ్రిపులు ఏమీ 
    చేయలేవు 
  • ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాదే
  • రాష్ట్రం లో ఇళ్ళు లేని వారు ఉండకూడదనేదే సిఎం కేసిఆర్ పట్టుదల
  • సూర్యాపేట నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా
  • శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదు
  • రౌడీయిజాన్ని సహించేది లేదు
  • ఆన్నం పెట్టింది కేసీఆర్ అయితే ..సున్నం పెట్టేది కాంగ్రెస్
  • కాంగ్రెస్ కు ఓటు వేస్తే చీకట్లే 
  • నా పరిపాలనలో రక్తం చుక్క కూడా కారడానికి వీల్లేదు
  • బిఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలి
  • ఆశీర్వదించండి  మీ ఇంటికి వాడిగా సేవ చెస్తా 
  • ఆత్మకూర్ మండలం కోటపహడ్, తుమ్మల పెన్ పహాడ్,  శెట్టిగుడెం,జొట్య తండ, అస్ల తాండలలో బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
  • బ్రహ్మ రథం పట్టిన ప్రజలు
  • బిఆర్ఎస్ లో చెరినకాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్ అయితే....సున్నం పెట్టేది కాంగ్రెస్ అని రాష్ట్రమంత్రి, సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్, కోటపహడ్, శెట్టిగుడెం,జొట్య తండ, అశ్లా తండా లలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కారు గుర్తుకు వేసిన ఓటు  రైతుల బీడు భూములను సస్యశ్యామలం చెసింది అన్నారు. నాకేసిన ఓటుతోనే మెడికల్ కాలేజ్ సూర్యాపేట జిల్లా గా ఏర్పడిందన్నారు.25 ఏళ్ళ దామోదర్ రెడ్డి పాలన లో జరిగిన అభివృద్ది శూన్యం అన్నారు.దామోదర్ రెడ్డి  మా గ్రామానికి ఈ  పని చేసిండని చెప్పే దమ్ము ఏ గ్రామ కాంగ్రెస్ నాయకుడికైనా ఉందా? అంటూ సవాల్ విసిరారు.
ముసలిపులి గాండ్రించుడు తప్పా చేసేది ఏమీ లేదన్నారు.

జన బలం ముందు ఏ టైగర్ లు  నిలబడవు అన్నారు. ఇసునూరు రామచంద్ర రెడ్డి వారసుడు దామోదర్ రెడ్డి అయితే నేను బి.ఎన్, ధర్మ బిక్షం వారసుడిని అని అన్నారు. ఆయనకు చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలని అన్నారు.గర్జించుడు.. గాండ్రిపులు ఏమీ చేయలేవన్నారు .శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదన్న మంత్రి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సూర్యాపేట నియోజకవర్గం లో 
రౌడీయిజాన్ని సహించేది లేదన్నారు.నా పరిపాలనలో రక్తం చుక్క కూడా కారడానికి వీల్లేదన్న మంత్రి,బిఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలి అని కోరారు.. వారి   అకృత్యాలను, బెదిరింపులను ప్రజాక్షేత్రం లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.సూర్యాపేట నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన ముందు ఉన్న సంకల్పం అన్న మంత్రి, రాష్ట్రం లో ఇళ్ళు లేని వారు ఉండకూడదనేదే సిఎం కేసిఆర్ పట్టుదల అన్నారు. సూర్యాపేట లో కూడా ఇళ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాదే అన్నారు.ఆశీర్వదించండి  మీ ఇంటి వాడిగా సేవ చెస్తా అని విజ్ఞప్తి చేశారు. మంత్రి ప్రచారం సందర్బంగా కోటపహడ్ కు చెందినకాంగ్రెస్ నాయకులు  కందాల ఆనంద్ రెడ్డి తో పాటు ఆయన  అనుచరులు జానయ్య , రమేష్, లింగయ్య, లతీఫ్, సురేష్, మల్లయ్య, గణేశ్, గంగయ్య, లక్ష్మారెడ్డి తో పాటు యూత్ అద్యక్షుడు వెంకటేష్ మరో 59 మంధి కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షం లో బిఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా తో స్వాగతం పలికారు.