శాంతి సామరస్యాలతో పండుగలు జరుపుకోవాలి- షాద్ నగర్ ఏసిపి సీహెచ్ కుషాల్కర్

శాంతి సామరస్యాలతో పండుగలు జరుపుకోవాలి-  షాద్ నగర్ ఏసిపి సీహెచ్ కుషాల్కర్

షాద్‌నగర్, ముద్ర : శ్రీరామనవమి, రంజాన్ పండుగలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) సిహెచ్. కుశాల్కర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎసీపీ కార్యాలయంలో హిందూ, ముస్లిం మతాలకు చెందిన పలువురు పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసారు.  

శాంతి సంఘ సమావేశాన్ని ఉద్దేశించి ఏసిపి కుషాల్కర్ మాట్లాడుతూ.. 
శ్రీరామనవమి, రంజాన్ మాసం సందర్భంగా ప్రజలు పట్టణంలో కలిసిమెలిసి సంతోషంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు ముందుగా సమయపాలన పాటించాలని సూచించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ బాధ్యత వహించాలని కోరారు. రేపు జరిగే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా సాయంత్రం యాత్ర ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగించాలని కోరారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని, శాంతి సంఘ సమావేశానికి సహకరించిన మత పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుతూ.. రాముడు కారణజన్ముడని, యుగపురుషుడని ఆయన సూచించిన శాంతి సామరస్య మార్గంలో అందరూ ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఏ దేవుడైనా ఒక్కడేనని అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతకు విలువ ఉంటుందని అన్నారు. షాద్ నగర్ లో అన్ని పండుగలు ఎంతో కలిసికట్టుగా ఐకమత్యంతో  జరుపుకుంటారని ఎలాంటి వివాదాలు ఉండవని పెద్దలు హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నవీన్ కుమార్, విశ్వహిందూ పరిషత్ నేత బండారు రమేష్, మైనార్టీ నేత అబ్దుల్ జామి, చెట్ల వెంకటేష్, ముక్తార్ అలీ,  కౌన్సిలర్ సర్వర్ పాషా, మహమ్మద్ అజాజ్  ఎంఐఎం గౌస్, కోఆప్షన్ సభ్యులు గౌస్ జానీ,  మల్చాలం మురళి తదితరులు పాల్గొన్నారు..