పెళ్లి చేస్తామని పిలిచి హత్య

పెళ్లి చేస్తామని పిలిచి హత్య
  • యువకుని  మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు

షాద్ నగర్, ముద్ర:-వరుసకు కూతురైన అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడం సరికాదని హెచ్చరించినా ఎలాంటి మార్పు రాకుండా, ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి వేధిస్తున్న యువకుడిని  పెళ్లి చేస్తామని పిలిచి అమ్మాయి కుటుంబ సభ్యులు హత్య చేశారు, .  ఈ సంగటన కు సంభదించి వివరాలను  శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

శంషాబాద్ డిసిపి కె. నారాయణరెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ పాశ్వాన్, దీపక్ పాశ్వాన్ అన్నదమ్ములు. తమ గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి బ్రతుకుతెరువు కోసం కోళ్ల ఫారాలలో పనిచేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్, మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిడద వెళ్లి గ్రామాలలోని వచ్చారు.  ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన రంజిత్ పాశ్వాన్ కూతురు (మైనర్ బాలిక)ను కరణ్ కుమార్ పాశ్వాన్ ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. అనంతరం ఆమె ఇద్దరు వివాహం చేసుకున్నట్టు వాట్సాప్ లో తమ బంధువులకు పంపించాడు. వారి ఆచూకీ కనుక్కొన్న అమ్మాయి తండ్రి  కిరణ్ కుమార్ పాశ్వాన్ తమ్ముడు అవుతాడని,  మైనర్ బాలికకు వరుసకు బాబాయ్ అవుతాడని  పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకొని కరణ్ కుమార్ పాశ్వాన్  ఆగస్టు 15వ తేదీన కేశంపేట మండలం నిడద వెళ్లి గ్రామ సంతలో మైనర్ బాలికతో మాట్లాడడం  అమ్మాయి తండ్రి చూసి  అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబ సభ్యులైన మంతోష్ కుమార్, డబ్ల్యూ కుమార్, మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి పథకం వేశాడు. పథకం ప్రకారం కరణ్ కుమార్ కు ఫోన్ చేసి పెళ్లి జరిపిస్తామని నిడద వెళ్లి గ్రామ శివారులో గల పోచమ్మ ఆలయం వద్దకు పిలిచి దాడి చేసి పక్కనే ఉన్న వరి చేను బురదలో తొక్కి చంపేశారు. అనంతరం వరిచేలోనే కిరణ్ కుమార్ పాశ్వాన్ మృతదేహాన్ని పాతిపెట్టి మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని కోళ్ల ఫారం యజమానికి సైతం చెప్పకుండా పారిపోయారు. తన తమ్ముడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కరణ్ కుమార్ సోదరుడు దీపక్ పాశ్వాన్ ఆగస్టు 29 వ తేదీన మిస్సింగ్ కేసును కేశంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు చేశాడు. తనకు రంజిత్ కుమార్ పాస్వాన్ కుటుంబం పై అనుమానం ఉందని పోలీసులకు తెలియజేశారు.  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శంషాబాద్ డిసిపి కె నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ  శ్రీరామ్ కుమార్, షాద్ నగర్ ఎం సి హెచ్ రంగస్వామి  నేతృత్వంలో  షాద్ నగర్ రూరల్ ఎస్సై డీకే లక్ష్మిరెడ్డి తమ సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలతో విచారణ చేసి నిందితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకిలో అదుపులోకి తీసుకున్నట్టు శంషాబాద్ డిసిపి తెలిపారు. ఐదు మంది నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారని డిసిపి నారాయణరెడ్డి తెలిపారు.