వికారాబాద్ లో ఘనంగా దసరా ఉత్సవాలు

వికారాబాద్ లో ఘనంగా దసరా ఉత్సవాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే విజయదశమిని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలంపల్లి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం స్వామివారిని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత పదితలల రావణాసురుడి భారీ కటౌట్ను దహనం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ దశమి సమ్మేళన సభలో శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ దసరా పండుగ ఐక్యతకు నిదర్శనమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని, విజయ దశమి పండుగ సందర్భంగా ప్రజలందరికి విజయాలు చేకూరాలని వేడుకున్నారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి.. జమ్మిని పంచుతూ ఒకరికొకరు సోదర భావంతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, కౌన్సిలర్లు కిరణ్ పటేల్, రామస్వామి, సురేష్ గౌడ్, పావని  చైర్మన్ శ్రీనివాస్, నాయకులు టైగర్ కృష్ణా, అప్పా విజయ్ కుమార్, కేదర్ నాథ్, సుజీత్ తదితరులు పాల్గొన్నారు.

కాగా మాజీ మంత్రి  గడ్డం ప్రసాద్ కుమార్ శ్రీ ఆలంపల్లి అనంత పద్మనాభ స్వామి వారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ టౌన్ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి , మరియు కాంగ్రెస్ పార్టి వివిధ అనుబంధ సంఘాల నాయకులు  పాల్గొన్నారు.