దసరా ఉత్సవం అదిరింది

దసరా ఉత్సవం అదిరింది
  • అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు
  • కేసీఆర్, కేటీఆర్ లతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన 
  • ఫ్లెక్సీలను తొలగించిన  ఫ్లయింగ్ స్కార్డ్ టీం 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : దసరా ఉత్సవం అదిరేటట్లు నిర్వహించిన స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ప్రతి పండుగకు ఒక ప్రఖ్యాతను చాటుకునే విధంగా అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా తన సొంత ఖర్చులతో ఈ దసరా కూడా మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా  కళాబృందాన్ని పిలిపించి  డప్పు చప్పుళ్లను ఏర్పాటు చేయించి  తలపాగాలు చుట్టించి కనివిని ఎరుగని స్థాయిలో నిర్వహించాడు. మొదటగా ఆలయం నుండి పెరమండ్లను అశ్వ వాహనంపై పెట్టి శ్రీ వేణుగోపాల ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్ గుమ్మడికాయ తో పాటు కొబ్బరికాయను కొట్టాడు. మాజీ సర్పంచ్ నేవూరి మమతా రెడ్డి బిజెపి నాయకులు సందుపట్ల రాజిరెడ్డికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా  అదేవిధంగా నెవూరి సురేందర్ రెడ్డి ని బౌన్సర్ తోయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.అనంతరం అశ్వ వాహనంపై పెరమండ్లను పురవీధుల గుండా ఊరేగింపుగా  ఎల్లారెడ్డిపేట పెద్దబడి ముందుకు తీసుకువెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులు సమర్పించారు. పెద్దబడి ముందు ఉన్న  మైదానం చుట్టూ సర్పంచ్ వెంకట్ రెడ్డి ప్రత్యేక లైటింగ్ ను ఏర్పాటు చేసి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫోటోలు ఉండడంతో సమాచారం తెలుసుకున్న సిఐ శశిధర్ రెడ్డి రంగ ప్రవేశం చేసి ఫ్లెక్సీలను తొలగించాలని అదేవిధంగా డీజే లో బీఆర్ఎస్ పాటలు వేయకూడదని కేవలం భక్తి పాటలు మాత్రమే వేసుకోవాలని సర్పంచ్ వెంకట్ రెడ్డికి సూచించారు.  అనంతరం ఫ్లయింగ్ స్కార్డ్ టీం వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. సర్పంచ్ ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడంతో ప్రజల్లో కొంత అసహనం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి  ఆలయ కమిటీ సభ్యులు  ఉపాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, కోశాధికారి బొమ్మ కంటి రవి గుప్తా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరశురాం గౌడ్, ఎనగందుల అనసూయ నర్సింలు, వెంకట నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యులు, జవ్వాజి లింగం,పందిర్ల శ్రీనివాస్ గౌడ్, కోడి మోజు దేవేందర్,నారాయణ, మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నెవూరి రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్, మేగి నరసయ్య, గంట అంజా గౌడ్, అప్సర్ ఉన్నిసా అజ్జు, శ్యామ మంజుల,  వివిధ సంఘాల అధ్యక్షులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.