షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం

షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం


ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయ్యప్ప షాపింగ్ మాల్ లోని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజన్ లు  వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ  మంటలు తీవ్రమయ్యాయి. షాపింగ్ మాల్ లో షార్ట్ సర్క్యూట తో అగ్ని ప్రమాదం  జరిగిందా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.