పతాక స్థాయికి ప్రచారం!

పతాక స్థాయికి ప్రచారం!
  • కామారెడ్డికి ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ రాక
  • రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల రోడ్ షోలు                                              

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కామారెడ్డి నియోజకవర్గంపై ఉండగా, ప్రధాన పార్టీల అగ్రనేతలు కామారెడ్డిలో ప్రచారానికి తరలివస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పోటీ చేస్తుండగా, వీరికి ధీటుగా బీజేపీ తరపున మాజీ జడ్పీ చైర్మన్ కాటిపల్లి వెంకట్రాం రెడ్డి పోటీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  బిఆరెస్ తరపున ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా, కాంగ్రెస్ తరపున కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డిలు బహిరంగ సభను నిర్వహించారు.  బీజేపీ నుంచి దేశ ప్రధాని నరేంద్రమోడీని కామారెడ్డికి విచ్చేస్తుండగా,  బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ శనివారం నాడు కామారెడ్డి కి విచ్చేస్తున్నారు.  జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భాజపా ఎన్నికల సభకు హాజరు కానున్నారు. అధికార యంత్రాంగంతో పాటు పార్టీశ్రే ణులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకేంద్రానికి వచ్చిన ఎస్పీజీ సిబ్బంది జిల్లా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భద్రతాపరమైన ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. ఇందిరాగాంధీ స్టేడియంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేస్తున్నారు. సభకు జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి జనాన్ని తర లించేందుకు పార్టీ నేతలు వాహనాలు సమకూర్చుతు న్నట్లు తెలుస్తోంది.                                                 

26న రాహుల్ గాంధీ పర్యటన?                                            

కాంగ్రెస్ తరపున కామారెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటన ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని సమాచారం. ఇక వీరితో పాటు ఎన్నికల ప్రచారానికి గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు జిల్లాలో విస్తృతంగా పర్య టించనున్నారు. నేటి నుంచి ఆయా అభ్యర్ధులు, వారికి మద్దతుగా అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్లు, కార్నర్ సమావేశా లకు ఏర్పాట్లు చేస్తున్నారు.   నేడు(శుక్రవారం) పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కామారెడ్డి నియో జకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా తాడ్వాయి మండలం క్రిష్ణాజివాడీకి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాకేం ద్రంలో నిర్వహించే ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళ నంలో పాల్గొంటారు. అనంతరం దోమకొండ, బీబీపే టల్లో నిర్వహించే రోడ్లు, వీధి సమావేశాల్లోపాల్గొననున్నారు. ఎల్లారెడ్డి పట్టణం, లింగంపే టలో మంత్రి హరీశ్ రావు శుక్రవారం రోడ్, వీధి సమావేశాల్లో పాల్గొంటారు. పిట్లం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో నేడు నిర్వ హించే కార్నర్ మీటింగు ఈటల రాజేందర్ హాజరుకానున్నట్లు భాజపా నాయకులు తెలిపారు. బిచ్కుంద మండల కేంద్రానికి శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వస్తున్నట్లు ఆ పార్టీ జుక్కల్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. కామారెడ్డిలో మంత్రి కేటీ ఆర్ రోడ్లు, కార్నర్ సమావే శాలు నిర్వహించనున్నారు.