పోతారం గ్రామానికి బస్సు రాకను అడ్డుకుంటే సహించేది లేదు...

పోతారం గ్రామానికి బస్సు రాకను అడ్డుకుంటే సహించేది లేదు...
  • రోడ్డు ప్రక్కన చెట్టు కొమ్మల తొలిగించిన గ్రామస్తులను అడ్డకున్న గ్రామ పాలక వర్గం
  • పాలకవర్గం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తుల
         

ముద్ర ముత్తారం: మండలంలోని పోతారం గ్రామానికి బస్సు సౌకర్యం లేక దశాబ్దం గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ముత్తారం మండలంలోని పోతారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు, గురువారం వారు గ్రామాలు విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అందులో భాగంగానే బుధవారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చెల్కల జితేందర్ యాదవ్  ఆధ్వర్యంలో పోతారం చెరువు కట్ట పై గల చెట్ల కొమ్మలను తొలిగించేందుకు కొడుతుంటే గ్రామ పంచాయతీ సిబ్బంది బండ ఓదెలు వచ్చి చేట్ల  కొమ్మలు కొట్టవద్దని చెప్పారని, ఎందుకు కొట్టవద్దని అనగా గ్రామ సర్పంచ్, కార్యదర్శి  కొట్టడం ఆపమని తనను పంపారన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేట్లు కొట్టడం బంద్ చేశామని, మరి బస్ ఎలా గ్రామంలోకి వస్తుందని సర్పంచులు కార్యదర్శులు ప్రశ్నించారు. 

గ్రామంలోకి బస్సు రాకను ఎవరు అడ్డుకున్న సహించేది లేదన్నారు. ప్రజల సౌకర్యార్థం గ్రామంలోకి బస్సు రావడం కోసం గ్రామస్తులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్ద చెట్ల  కొమ్మలు తొలగిస్తుంటే పోతారం గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సిబ్బందిని పంపడం సరికాదని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రయాణికులు ప్రధాన రహదారికి దాదాపు 3 కిలో మీటర్లు నడవలేక దూర భారం తగ్గిద్దామని మంచి ఉద్దేశంతో బస్సు రాకకు అడ్డుగా ఉన్న  చెట్ల కొమ్మలను తొలగిస్తుంటే వారు అడ్డుకోవడం ఏంటని సర్పంచ్ ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలోకి బస్సు రాకను నిలిపివేసారని, యావత్తు తెలంగాణ రాష్ట్రమంతట మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో సంబరాలు చేసుకుంటుంటే పోతారం గ్రామ సర్పంచ్, కార్యదర్శులు మాత్రం బస్సు ని గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.  ఈ ప్రభుత్వంలో  బస్ గ్రామానికి వస్తే మంత్రి శ్రీధర్ బాబుకు ఎక్కడ పేరు వస్తుందో అన్న వక్రబుద్ధితో అభివృద్ధికి అడ్డుపడడం హేయమైన చర్య అని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిలు బండ సమ్మయ్య, నెత్తెట్ల కొమురయ్య, నాయకులు  సిరారపు నరేష్, చింతల అనిల్ కుమార్, చెల్కల కిషన్, చెల్కల నరేందర్, బత్తుల రాజయ్య, ఒడ్నాల సమ్మయ్య, సంగెం వెంకట్రాజం, నాంసాని సునిల్, ఒల్లపు డిసెందర్, ఇట్టం గట్టయ్య, జంగపల్లి రాజ్ కుమార్, తూడూరి పూర్ణచంధర్, తమ్మశెట్టి సనత్, కార్యకర్తలు పాల్గొన్నారు.