కల్వల  ప్రాజెక్ట్ కు గండి

కల్వల  ప్రాజెక్ట్ కు గండి

శంకరపట్నం ముద్ర జూలై 28 : మండల పరిధిలోని కల్వల గ్రామంలోని చెరువుకు గండి పడింది.జోరుగా కురుస్తున్న వానలకు భారీగా వరద పోటెత్తడంతో కలువల చెరువుకు గండి పడింది. చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని  ముందుగానే పసిగట్టినగ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు  చెరువుకు తాత్కాలికంగా ఇసుక బస్తాలతో మరమ్మతులు చేశారు . వరద నీరు  రావడంతో మత్తడి పక్కన గల మట్టి కట్టకు గండిపడింది. చెరువు నుండి నీరు భారీగా గండి ద్వారా బయటికి ప్రవహిస్తుంది. చెరువు కింద గల పంట పొలాలు నాటు వేయడంతో పొలాలు నీట మునిగాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు బోరుణ విలపిస్తున్నారు.  సమాచారం తెలిసిన వెంటనే కలువల గ్రామ సర్పంచ్ దాసరపు భద్రయ్య స్పందించి అధికారులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటన స్థలానికి అధికారులు చేరుకుంటున్నారు.