గణపతి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి - బడుగుల లింగయ్య యాదవ్

గణపతి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి - బడుగుల లింగయ్య యాదవ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: అన్నదానం మహాదానమని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.  వినాయక చవితి నవరాత్రి వేడుకలలో భాగంగా విద్యానగర్ లోని మధు ట్రావెల్స్ వద్ద  45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహం వద్ద  ప్రత్యేక పూజల నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కౌన్సిలర్ పాషా, బూర బాల సైదులు గౌడ్ లను  సన్మానించారు.అనంతరం అన్నదానం అన్నప్రసాద వితరణను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.   గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.  

గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, నిమజ్జనం కార్యక్రమం పోలీసు శాఖ వారి సూచనల మేరకు జరుపుకోవాలని రాబోయే ఎన్నికలలో మూడో పర్యాయం ఏర్పడేది కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వమేనని సూర్యాపేటలో మూడో పర్యాయం శాసనసభ్యులు గా గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డ్ ప్రజలు మరోదఫా కౌన్సిలర్ గా  పావని కృపాకర్ ను గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు పట్టణాన్ని గతంలో ఎన్నడు లేని అభివృద్ధిని ఆచరణలో చేసి చూపించిన ఘనత మంత్రికే దక్కిందని అన్నారు. 45 వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మంచి సేవా దృక్పథం ఉన్న కౌన్సిలర్ అని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమాజాభివృద్ధికి ఎంతో సేవ చేస్తారని ఈ సందర్భంగా అభినందించారు.  ఈ కార్యక్రమంలో  చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, బట్టల  వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడు బిఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, కౌన్సిలర్ తాహెర్ పాషా, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, నూకల వెంకట్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, 45 వ వార్డు అధ్యక్షుడు కుక్కడపు సాలయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు కుక్కడపు భిక్షం,మధు  ట్రావెల్స్ ప్రొప్రైటర్ మధు,  బజ్జూరి శ్రీనివాస్, సంగిశెట్టి వెంకటేష్, మృదులాగర్ కళ్యాణ్, సందీప్ పాల్గొన్నారు.