పేదల విద్యాభివృద్ధికి పెద్దపీట- గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్

పేదల విద్యాభివృద్ధికి పెద్దపీట- గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్

కేసముద్రం, ముద్ర: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల విద్యాభివృద్ధి కోసం పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో కొత్తగా ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే మూడేళ్ల క్రితం4.25 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల నేడు  దేశంలో తెలంగాణ విద్యాభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కేసముద్రం గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం కోటి రూపాయలు అదనంగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు, ఆర్ సి ఓ రాజ్యలక్ష్మి, ఐటీడీఏ ఈఈ హేమ లత, ప్రిన్సిపల్ శైలజ రాణి పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో కంప్యూటర్ లాబ్ ను ప్రారంభించారు. అలాగే ఉప్పరపల్లి ఆర్ అండ్ బి ఎక్స్ రోడ్డు నుంచి వరకు 2.99 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డు, వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.