రైతులకు గుడ్ న్యూస్..రేపే అకౌంట్లోకి పీఎం కిసాన్ పథకం డబ్బులు

రైతులకు గుడ్ న్యూస్..రేపే అకౌంట్లోకి పీఎం కిసాన్ పథకం డబ్బులు

ముద్ర,సెంట్రల్ డెస్క్:- పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోదీ బదిలీ చేయనున్నారు. ఈ పథకం కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో.. రూ.2వేలు చొప్పున) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు.

రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి” పథకాన్ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం​ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్​లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ – జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కాబోతున్నాయి.