డెలివరీ బాయ్​గా జొమాటో సీఈవో!

డెలివరీ బాయ్​గా జొమాటో సీఈవో!

ముంబై: స్నేహితుల దినోత్సవం రోజున జొమాటో సీఈవో దీపిందర్​ గోయల్​సాధారణ డెలివరీ బాయ్​ అవతారం ఎత్తారు. కంపెనీ టీ షర్టు ధరించి బైక్​పైన ఫుడ్​ డెలివరీలు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయనే స్వయంగా తన ట్విట్టర్​ అకౌంట్​లో పోస్ట్​ చేశారు. దీపిందర్​పోస్ట్​పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులో సీఈఓ ఎరుపు రంగు టీషర్ట్ ధరించి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పైన కస్టమర్లకు ఆహారం అందించేందుకు బయల్దేరారు. ఆయన చేతిలో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కూడా ఉండడం విశేషం. డెలివరీ పార్ట్‌నర్స్, కస్టమర్లు, రెస్టారెంట్ పార్ట్‌నర్లకు కూడా ఈ బ్యాండ్లు అందించనున్నారు. కంపెనీతో అనుబంధం ఉన్న వ్యక్తులతో కలిసి ఆయన స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటారని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.