ప్రిగోజిన్ యూ టర్న్​

ప్రిగోజిన్ యూ టర్న్​
  • తన సైన్యాన్ని ఉక్రెయిన్​బార్డర్​కు తరలింపు
  • హర్షం వ్యక్తం చేసిన రష్యన్లు
     

మాస్కో: రష్యాపై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్​వెనక్కు తగ్గారు. తన ప్రైవేటు సైన్యంతో మాస్కోను చుట్టుముట్టేందుకు నిర్ణయించిన ఆయన.. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని సైన్యాన్ని ఉక్రెయిన్​బోర్డర్లోని బంకర్లకు తరలించారు. ఈ నిర్ణయంతో రష్యన్లు, ప్రపంచదేశాలు ఉపిరిపీల్చుకున్నాయి. మరోవైపు పుతిన్ వార్నింగ్​కు భయపడి ప్రిగోజిన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు కూడా చెబుతున్నారు. కాగా ప్రిగోజిన్, పుతిన్​మధ్య సయోధ్యకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించడంతోనే వేగనార్ సైన్యం వెనక్కి తగ్గినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. ఈ సందర్భంగా వేగనార్ సైన్యం తమ భారీ యుద్ధట్యాంకులు, కాన్వాయ్​తో వెళుతుండగా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వేగనార్ సైన్యం అధ్యక్షుడు ప్రిగోజిన్​ మాట్లాడుతూ.. రష్యన్లు రక్తం చిందించడం వేగనార్​కు ఇష్టం లేదన్నారు. తాము నిజమైన దేశభక్తులమైనందునే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. పుతిన్ తమను దేశద్రోహులని పెద్ద తప్పుచేశాడని,  దీనికి మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ప్రజాక్షేత్రంలో శాంతిస్థాపనే తమ ఉద్దేశమని, అందుకే వెనక్కు తగ్గామని ప్రిగోజిన్ పేర్కొన్నారు. 

ప్రిగోజిన్​అరెస్టుపై వెనక్కు తగ్గిన పుతిన్..

తిరుగుబాటుపై ప్రిగోజిన్​వెనక్కు తగ్గడంతో పుతిన్​కూడా చల్లబడ్డారు. ప్రిగోజిన్​ను అరెస్టు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు రష్యా మీడియా ఆదివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడేనని మీడియా స్పష్టం చేసింది. కాగా రష్యా చర్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగనార్​ తిరుగుబాటుతో రష్యా సైనిక బలం తగ్గిందని అన్నారు.