ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

పాలకుర్తి ముద్ర:  ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు పాలకుర్తి పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొడకండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ పార్టీ మండల అధ్యక్షుడు గిరగానే కుమార్ స్వాముల నేతృత్వంలో జరిగాయి. జన్మదిన వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని స్థానిక నాయకులు రాజీవ్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.