ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి: కోటాచలం

ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి: కోటాచలం

ముద్ర/ తిరుమలగిరి: జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం బుధ వారం నాడు తిరుమలగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న పనులను పరిశీలించారు  సబ్ సెంటర్  లో  వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అరోగ్యరక్షణ కోరకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పుల పెంచాలని కోరారు. గర్భిణి స్త్రీలకు, చిన్న పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలాని వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రతీ గ్రామంలో ఓ అర్ ఎస్ డిపో ఏర్పాటు చేసి ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని అరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ మల్లెల వందన, సి ఎచ్ ఓ మాలోతు బిచ్చు నాయక్, నర్సిహ్మారెడ్డి, రమాదేవి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.