చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ముద్ర, తెలంగాణ బ్యూరో :  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లో అవినీతి అక్రమాల కేసులో  టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీ వరకు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీఐడీకి సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై సోమవారం (ఈ నెల 18వ తేదీ ) దాకా విచారణ చేపట్టొద్దని ఏసీబీ కోర్టును ఏపీ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును 5రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ కస్టడీకి చంద్రబాబును పంపొద్దని ఆయన తరఫు లాయర్లు హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించి న్యాయస్థానం సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా ఈ నెల 19వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.