అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు 

అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు 

హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. ఈక్రమంలోనే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులకు పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు సర్క్యులర్‌ జారీ చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను  నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్‌, నీటి సరఫరాతో పాటు ఇతర ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తాజాగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో లైవ్‌, స్టోరేజీ ఏర్పాట్లుండేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రం ప్రైవేట్‌ స్కూళ్లో ఉన్నా సరే.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కెమెరాల ఏర్పాటుకయ్యే వ్యయాన్ని ఆయా పాఠశాల యాజమాన్యాలే భరించాలని తెలిపింది.