రైతు బంధు ను ఆపేయ్యమనడం*కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట

రైతు బంధు ను ఆపేయ్యమనడం*కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట
  • మంత్రి జగదీష్ రెడ్డి 
  •  కాంగ్రెస్ రద్దుల పార్టీ 
  • కాంగ్రెస్ చర్యల పై ప్రజలు ఉద్యమించి , తిరగబడాలి
  • గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయండని ప్రజలకు పిలుపు
  • కాంగ్రెస్ తీరు ఉచిత విద్యుత్ , మిషన్ భగీరదా కూడా ఆపేలా ఉంది
  • కేసీఆర్ పథకాలు ఆపాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్
  • తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుంది
  • కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్ళు వదిలే దుస్థితి వచ్చింది
  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవు
  • ఇక్కడ  కేసీఆర్ పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయతీ ఉండదని కుట్ర
  • కాంగ్రెస్ , బీజేపీల అజెండా ఒక్కటే
  • కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను  తెలంగాణ ప్రజలు గమనించాలి
  • ప్రజల కోసంపనిచేసే పార్టీని గుర్తించాలి
  • బీజేపీ కి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చింది
  • బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చందంగా దేశ
  • ప్రజల పరిస్థితి మారింది
  • ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బిజేపి కి అసలు అభ్యర్థులే లేరు
  • ఈసీ కి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైంది

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- రైతు బంధు ను ఆపేయ్యమనీ ఈసీ కి పిర్యాదు చెయడం  కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కాంగ్రెస్ రద్దుల పార్టీ అని పేర్కొన్నారు.కాంగ్రెస్ రైతు బంధు ఆపేయమని ఫిర్యాదు చేయడం దుర్మార్గం అన్నారు.కాంగ్రెస్ చర్యల పై ప్రజలు ఉద్యమించి , తిరగబడాలన్న మంత్రి,గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలదీయండని ప్రజలకు పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ తీరు ఉచిత విద్యుత్ , మిషన్ భగీరదా కూడా ఆపేలా ఉందన్నార.కేసీఆర్ పథకాలు ఆపాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కు తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని భయం పట్టుకుంది అన్నారు.
కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్ళు వదిలే దుస్థితి వచ్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీ పద్దుల  పార్టీ కాదు రద్దుల పార్టీ అని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కేసీఆర్ పథకాలు లేవన్నారు.ఇక్కడ  కేసీఆర్ పథకాలు ఆపేస్తే దేశంలో ఎక్కడా పంచాయతీ ఉండదని కుట్ర జరుగుతుందని అన్నారు.దేనికి గాను కాంగ్రెస్ , బీజేపీలు  ఒకటే అజెండా తో పని చేస్తున్నాయని అన్నారు.కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలి అని కోరారు.కాంగ్రెస్ , బీజేపీ లు పోటీచేసే అభ్యర్ధులని ఇచ్చిపుచ్చుకుంటున్నారనీ ఆరోపించారు.బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయకుండా చేయాలని కాంగ్రెస్ , బీజేపీ లు కుట్ర చేస్తున్నాయన్నారు.
ప్రజల కోసంపనిచేసే పార్టీని ప్రజలు గుర్తించాలి అన్నారు.బీజేపీ కి రెండు సార్లు అధికారం ఇస్తే దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చిందన్నారు.
బీజేపీ పాలనలో పెనం నుండి పొయ్యిలో పడ్డ చెందంగా  దేశ ప్రజల పరిస్థితి మారిందన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బిజేపి కి అసలు అభ్యర్థులే లేరని ఎడ్డేవా చేశారు.ఈసీ కి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు.