బిఆర్ఎస్ లోకి రండి

బిఆర్ఎస్ లోకి రండి

 మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీలోకి రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. శశిధర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో కలిసి బుధవారం హైదరాబాదులోని మెదక్ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. త్వరలో బిఆర్ఎస్ లో చేరనున్నట్లు పట్లళ్ల శశిధర్ రెడ్డి తెలిపారు. శశిధర్ రెడ్డి 2004 నుండి 2009 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండు రోజుల్లో పార్టీలో చేరనున్నట్లు శశిధర్ రెడ్డి తెలిపారు.