కాంగ్రెస్ పార్టీలో చేరికలు

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామనికి చెందిన గొర్ల కాపరి సంఘము అధ్యక్షులు గట్టు లాస్మయ్య, వార్డు సభ్యులు గంగినేని కరుణాకర్ మరియు 150 మంది బిఆర్ఎస్ నాయకులు మరియు నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మునిందర్, ఆనంద్ చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మి పతి గౌడ్, బోలుమాల శంకర్, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కనుకయ్య, ముంజ సతీష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్, ఎండీ బాబు, ధర్మయ్య, వెంకటేష్, ప్రేమ్ కుమార్, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ హుస్సేన్, ఎండీ రఫీ, మల్కాపురం అనిల్, మండల నరేష్ , యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ గౌడ్ నిమ్మ వినోద్ రెడ్డి, శ్రీకాంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.