మోదీ దిష్టిబొమ్మ దహనం

మోదీ దిష్టిబొమ్మ దహనం
  • మోదీ దిష్టిబొమ్మ దహనం
  • కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా
  • ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో


ముద్ర,ఎల్లారెడ్డిపేట :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం దహనం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మోదీ దిష్టిబొమ్మను  దహనం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ గతంలో రాహుల్ గాంధీ  మాట్లాడుతూ   మోదీ పేరు గల వ్యక్తులు అన్యాయాలు చేస్తున్నారని ఆరోపించిన సంఘటనలో గుజరాత్ లోని లక్నో న్యాయస్థానం రాహుల్ గాంధీకి అన్యాయంగా రెండు సంవత్సరాలు జైలు శిక్ష పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగిందని,దీనిపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లగా గుజరాత్ హైకోర్టుకే వెళ్ళమని సుప్రీంకోర్టు ఆదేశించింది.గుజరాత్ హైకోర్టుకు వెళ్లగా శుక్రవారం మళ్లీ సుప్రీంకోర్టుకే వెళ్ళమని గుజరాత్ హైకోర్టు చెప్పడం అన్యాయం అని కాంగ్రెస్ వర్గాలు భారతదేశం అంతటా ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. రాహుల్ గాంధీకి క్లీన్ చీట్ ఇస్తే హీరోగా మారిపోతారని బిజెపి ప్రభుత్వం ఈ తప్పుడు విధానాలకు నాంది పలికిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి,  నాయకులు గంట బుచ్చగౌడ్,ఇమామ్, చెన్ని బాబు,  బిపేట రాజు , పందిర్ల శ్రీనివాస్,  భూమి రెడ్డి,  మల్లయ్య, గణపతి ,సంతోష్ గౌడ్  తదితరులు  పాల్గొన్నారు.