సి.వి. రామన్ ని విద్యార్థులు యువత స్ఫూర్తిగా తీసుకోవాలి (సి.వి రామన్ 135వ జయంతి)

సి.వి. రామన్ ని విద్యార్థులు యువత స్ఫూర్తిగా తీసుకోవాలి  (సి.వి రామన్ 135వ జయంతి)

ముద్ర నవంబర్ 7 ఎల్లారెడ్డిపేట : నిరంతరం పరిశీలన ,పరిశోధన దృష్టి కలిగి ఉండి కష్టపడి చదివి భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేసి " రామన్ ఎఫెక్టు" కనుగొని శాస్త్రీయరంగంలో అపారమైన ప్రతిభను చూపి 1930లో నోబెల్ బహుమతి పొందిన చంద్రశేఖర్ వెంకటరామణ్ ని విద్యార్థులు, యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు. మంగళవారం రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రముఖ భారత శాస్త్రవేత్త సి.వి రామన్ గారి 135వ జయంతిని నిర్వహించారు. ఆయన ఫోటోకు పూలాలంకరణ చేశారు.ఈ సందర్భంగా జాతీయ సేవాపథకం అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ  సి.వి రామన్ చంద్రశేఖర్ పార్వతీ దంపతులకు జన్మించారనీ చిన్నప్పటినుండి చదువుపై పరిశోధనపై మక్కువ పెంచుకున్న రామన్ 18 సంవత్సరాల వయస్సులోనే భౌతికశాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. అకౌంటెంట్ ఉద్యోగం చేసినా నిజాయితీగా పని చేశారని, ఒకసారి ఒక రైతువి సగం కాలిన నోట్లు తీసుకుని బదిలీ ఇవ్వడానికి నిరాకరించిన ఉద్యోగిని నోట్లపై నెంబర్లున్నాయి తీసుకోవాలని పట్టుబట్టి రైతుకు న్యాయం చేసిన నిజాయితీపరులనీ అన్నారు.

కెమిస్ట్రీ  అధ్యాపకులు నీరటి విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ  సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారనీ నోబెల్ బహుమతి, భారతరత్న  సి.వి రామన్ కి లభించాయనీ విద్యార్థులు పరిశోధనలవైపు దృష్టి సారించాలన్నారు.ఫిజిక్స్ అధ్యాపకులు చిలుక ప్రవళిక మాట్లాడుతూ సి.వి రామన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారనీ కష్టపడి చదివి ప్రొఫెసర్ గా,శాస్త్రవేత్తగా రాణించారనీ భారతీయులు విదేశాలకు వెళ్లడం కాకుండా విదేశీయులు శాస్త్ర విజ్ఞానరంగంలో అభ్యసించడానికి భారతదేశం వచ్చేలా తయారుకావాలనీ రామన్ సూచించారనీ తెలిపారు.

అనంతరం క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో  ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ,ఎన్.ఎస్.ఎస్  మరియు సాంస్కృతిక విభాగం అధికారి వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమోళి,చెరుకు భూమక్క,బుట్ట కవిత,నీరటి విష్ణు ప్రసాద్, ఆర్.గీత,అగోలమ్ గౌతమి,కొడిముంజ సాగర్,చిలుక ప్రవళిక, భోధనేతర సిబ్బంది, విమల్ కుమార్, కె.దేవేందర్, ఎం.డి తాజోద్దిన్, లక్ష్మీ, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.