ఖబడ్దార్ రేవంత్

ఖబడ్దార్ రేవంత్
  • తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం
  • జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
  • ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ శ్రేణులు 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి మాటలకు నిరసనగా "కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై" నేడు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ  శ్రేణులు అనంతరం BRS నాయకులు మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతుందని, రైతు సంక్షేమాన్ని అడ్డుకుంటే సహించేది లేదని,కాంగ్రెస్ కుట్రలను ప్రజలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు."ఉచిత విద్యుత్ వద్దంటే...ఊరి పొలిమేర దాకా ఉరికించడం" జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ టౌన్, రూరల్ మండలాల, పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.