రాజీయే రాజమార్గం...

రాజీయే రాజమార్గం...

జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్
ముద్ర ప్రతినిధి భువనగిరి : రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ  అధ్యక్షులు ఎ.జయరాజు అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల ఆవరణలలో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ తో చిన్న తగాదాలను, సివిల్ కేసులను పరిష్కరించుకొని తమ కుటుంబ శ్రేయస్సుకు , ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతుందన్నారు.

  కార్యాక్రమములో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతీదేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, కార్యదర్శి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కె. దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ డి. నాగేశ్వర్ రావు, అదనపు డి.సి.పి. లక్ష్మినారాయణ, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పి.పి.లు శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి, పద్మజ, ప్రభుత్వ న్యాయవాదులు బి. కేశవ రెడ్డి, బాబూరావు, న్యాయ సహాయ న్యాయవాదులు  ఎస్. జయపాల్, జి. శంకర్, కక్షిదారులు, పోలీసు యంత్రాంగం, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా వ్యాప్తంగా 6278 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు టెలిఫోన్ ఋణ బకాయల కేసులు 17, ఎస్.బి.ఐ. 9 కేసులను, ట్రాఫిక్ చలాన కేసులు 3,09,615 మొత్తం 315928 పరిష్కరించబడ్డాయి.