గేటు తెరిచినం... ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం.

గేటు తెరిచినం... ఫ్యాక్టరీ ప్రారంభిస్తాం.
  • ఫ్యాక్టరీ భూములు తకట్టులో ఉన్నాయి
  • త్వరలోనే విడిపిస్తాం..
  • రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో
  • ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు

మెట్‌పల్లి ముద్ర :- తొమ్మిదేళ్లుగా మూసి ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గేటు తెరిచమని..త్వరలోనే ఫ్యాక్టరీ కూడా ప్రారంభిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యే లు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్,నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ లతో కలిసి మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పై రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆనంతరం శ్రీదర్ బాబు మాట్లాడుతూ. చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గాను ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాడనికి  ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, ఆ కమిటి చెరుకు రైతులు, అధికారులతో చర్చలు జరిపిందని. షుగర్ ఫ్యాక్టరీ భూములు బ్యాంక్ లో తాకట్టులో ఉన్నవని వాటిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడిపిన యాజమాన్యంతో సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించి ముందడుగు వేశామని తెలిపారు.ఇప్పటికే మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని షుగర్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే వరకు షుగర్ కేన్ కమిషన్ ప్రత్యేక సి ఎస్ 15 రోజులకు ఒకసారి స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాడని ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాడని. ప్రతి నెలకోసారి ప్రజా ప్రతినిధులు షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి అధ్యయనం చేస్తారని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో షుగర్ ఫ్యాక్టరీని ప్రజల ఆధారిత పరిశ్రమగా తీర్చేదిద్దుతామని. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ప్రజలు, రైతులు మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రజల, రైతుల  ప్రభుత్వం ఏర్పడిందని ప్రజల పక్షాన నిలబడి పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు, కృష్ణ రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.