బేగంపేటలో అరుదైన ఘటన..ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు

ముద్ర,హైదరాబాద్:- బేగంపేటలో తల్లీకూతుళ్లు ఇద్దరూ నివసిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వారి ఇంట్లోకి ఇద్దరు దుండగులు తలకు హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత బ్యాగులోని తుపాకీని తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఒక్కసారిగా తల్లీకూతుళ్లు ఇద్దరు షాక్‌ కు గురయ్యారు.

ఆ తర్వాత వెంటనే తేరుకొని అదును చూసి నిందితుల నుంచి తుపాకీ లాక్కొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు దాడి చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. ఆ తర్వాత నిందితులు తప్పించుకొని పారిపోయారు.తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు దుండగులు యూపీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తల్లికూతుళ్ల ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.