“అందుబాటులో లేని ఆక్సిజన్ ప్లాంట్”

“అందుబాటులో లేని ఆక్సిజన్ ప్లాంట్”
  • ఆక్సిజన్ కేంద్రానికి తాళం..?
  • సుమారు 35 లక్షలు వృధా..
  • బయట నుంచి సిలిండర్ల కొనుగోలు..

రామకృష్ణాపూర్,ముద్ర : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు, కార్మికు కుటుంబ సభ్యులకు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సింగరేణి సంస్థ,సి అండ్ ఏండీ ప్రత్యేక చొరవతో లక్షల రూపాయలను వేచించి ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సింగరేణి వ్యాప్తంగా నెలకొల్పిన ఏరియా ఆసుపత్రులలో ఐదు ఆక్సిజన్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేసింది. టర్కీ దేశం నుంచి దిగుమతి చేసిన ఆక్సిజన్ ప్లాంట్ తో ప్రతి రోజూ రెండు లక్షల యాబై వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ సుమారు నలబై సిలిండరర్లు,ఒక గంటకు 12 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం వరకు అందిస్తున్న కేంద్రాలను సంవత్సర కాలం పాటు పక్కన పెట్టారు.కరోనా దర్డ్ వెవ్ ధైర్యంగా ఎదుర్కొనేందుకు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కేంద్రాన్ని ప్రారంభించిన కొద్ది రోజులకే తాళం వేశారు. సింగరేణి సంస్థ లక్షల రూపాయలను వేచించి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఉపయోగించకుండా బయట నుంచి సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆక్సిజన్ కేంద్రానికి తాళం వేయడంతో లక్షల రూపాయలను వృధా చేశారనే విమర్శలు కార్మిక వర్గం నుంచి వ్యక్తం అవుతున్నాయి. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి బయట నుంచి కొనుగోలు చేసే ఆక్సిజన్ సిలిండర్లకు అడ్డుకట్ట వేయాలని కష్టపడి పని చేస్తున్న కార్మికులు ఉన్నత అధికారులను కోరుతున్నారు.

“చదువురాని మమ్మల్ని పట్టించుకోవడం లేదు”

•మందులు ఇచ్చే వారిదే హవా..!

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు,మందులు తీసుకునేందుకు వచ్చే కార్మికులు,కార్మిక కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. నెల రోజులకు ఒక్క సారి ఆరోగ్య పరీక్షలు,మందులు తీసుకునేందుకు వచ్చే వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు. మంగళవారం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఓ రిటైర్డ్ కార్మికుని భార్య తమ ఆవేదనను వ్యక్తం చేసింది. వైద్యున్ని సంప్రదించిన అనంతరం వైద్యుడు రాసిన మందులను తీసుకునేందుకు వెళ్లిన క్రమంలో మెడిసిన్ ఇచ్చే వ్యక్తి పుస్తకంలో వైద్యుడు రాసిన మందులను పరిశీలించకుండానే తమ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని, చదువురాని నన్ను ఈ విధంగా చూడటం ఏమిటని రిటైర్డ్ కార్మికుని భార్య ఆసుపత్రిలోనే కొందరితో చర్చించారు. చదువురాని మాకు వైద్యుడు రాసిన మందుల గురించి ఎలా తెలుస్తుందని,మెడిసిన్ ఇచ్చే  వ్యక్తికి తెలిసి కూడా ఆసుపత్రిలోనే తిప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కంటతడి పెట్టింది. వేరే ప్రాంతాల నుంచి వచ్చే తమ పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సదరు మహిళ డిమాండ్ చేసింది.ఆసుపత్రిలో ఏర్పడిన వైద్యుల కొరతతో  కార్మికులకు, కార్మిక కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని ఆమె ఆరోపించింది. ఇప్పటికైనా సింగరేణి సంస్థ అధికారులు కొంత దృష్టి పెట్టి వైద్యులను నియమించి మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరుతున్నారు.