గుర్రపు బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడులు.. 13మంది అరెస్టు..

గుర్రపు బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడులు.. 13మంది అరెస్టు..

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఆన్ లైన్ లో గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు బెట్టింగ్ స్థావరంపై దాడులు చేశారు. తేజస్వీ నగర్ కాలనీలోని ఓ ఇంటిపై దాడులు చేయి ఆన్ లైన్ లో గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మందిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.51వేల నగదు, 17 మొబైల్ ఫోన్లు, 19 డెబిట్, క్రెడిట్ కార్డులు, రేసింగ్ రేసింగ్ గైడ్ బుక్ తోపాటు ఓ కారును సీజ్ చేసినట్లు వివరించారు. వాట్స్ ఆప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో గుర్రపు స్వారీ సమాచారం పోస్టు చేస్తున్నారని, ఆర్ ఎస్ వరల్డ్ అనే గ్రూప్ ద్వారా గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్నారు. గేమింగ్ యాక్టు కింద తిరుమల్ రెడ్డితోపాటు 13 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.పట్టుబడ్డ వారిలో అందరూ బాడా వ్యాపారస్తులుగా గుర్తింపు పొందారని, గత సంవత్సరం నుండి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.