నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం

నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం  ప్రారంభమయ్యాయి.  సంప్రదాయంగా వస్తున్న గవర్నర్ ప్రసంగానికి ఉభయసభల సంయుక్త సమావేశం వేదికైంది. ఈ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక ప్రసంగం చేశారు. తొలిసారి అసెంబ్లీలో  ప్రసంగిస్తూ.. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. వినూత్నంగా వాలంటీర్‌ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్‌ తెలిపారు. నవరత్నాలతో రాష్ట్రానికి సంక్షేమ పాలన అందుతోందన్నారు. నాలుగేళ్లుగా ఐదు కోట్ల మందికి సంక్షేమ పాలన అందుతోందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అవినీతి లేని పాలన అందుతోందన్నారు. రాష్ట్రంలో 11.43 శాతం జీడీపీ వృద్ధి నమోదైందన్నారు. 2020-21 జీడీపీ వృద్ధిలో ఏపీ దేశంలోనే నంబర్ 1గా ఉందన్నారు.