స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ

స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామ శివారు జిబి తండాలో బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్టును మండలం వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారపాక రాములు వార్డు సభ్యులు ఉమ్మగోని రమ-రాజు, అంగన్వాడి టీచర్ వాంకోడుతు లలిత, ఆశ కార్యకర్తలు భుక్య జ్యోతి, గ్రామ కారోబార్ ఎండీ. సలీమ్, వాటర్ మెన్ రచ్చ శ్రీనివాస్, పండుగ శ్రీకాంత్, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.