ఇప్పగూడెంలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం

ఇప్పగూడెంలో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ జనగామ ఆధ్వర్యంలో వాలీబాల్ వేసవి శిక్షణ తరగతులు గురువారం ప్రారంభించారు. పాఠశాలలో పిఈటి గిరెడ్డి ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ శిక్షణ తరగతులు నెల రోజులు కొనసాగుతాయి. ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 4.30 నుండి 6. వరకు శిక్షణ ఉంటుందని ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రఘజీ, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు డి.శ్రీధర్, సిహెచ్.గణేష్, కె. నరేందర్, సిహెచ్.శ్రీకాంత్, సిహెచ్. అశోక్, సిహెచ్. ప్రశాంత్, సాంబరాజు విద్యార్థులు పాల్గొన్నారు.