మీ మేనిఫెస్టోను జనం నమ్మబోరు - టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

మీ మేనిఫెస్టోను జనం నమ్మబోరు - టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్​ మేనిఫెస్టోను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నమ్మబోరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల మనసులను ఖాళీ చేసేలా సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్​ రెడ్డి.. 2014, 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, రూ.లక్ష పంట రుణమాఫీ, రూ.3,116 నిరుద్యోగ భృతి, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇతర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతుండ‌డంతో బీఆర్ఎస్​ మ‌ళ్లీ తీసుకువ‌స్తున్న కొత్త మేనిఫెస్టోను ఎవరు నమ్ముతారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త అబద్ధాలతో ముందుకు రాబోతున్నద‌ని ఆరోపించారు.