మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుందాం చైర్మన్

మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుందాం చైర్మన్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :గద్వాల్ జిల్లా కేంద్రంలోని మధర్సా ఏ దారుల్ ఉలూమ్ రషీదియా షేరెల్లి స్ట్రీట్ లో హిబ్స్ హాఫిజ్ లుగా విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఆదేశాల మేరకు మునిసిపల్ చైర్మన్ బి.యస్ కేశవ్, ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి, సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత పెద్దలు, మునిసిపల్ ఛైర్మన్ కి, ఎమ్మెల్యే కుమారుడు, కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు .

ఛైర్మన్. మాట్లాడుతూ.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్. నేతృత్వంలో ముస్లిం మైనార్టీ సోదరులకు పెద్దపీట వేయడం జరిగినది. అన్ని వర్గాల మతాలతో సమానంగా ముస్లిం మతాన్ని కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గతంలో ముస్లిం మైనార్టీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు కూడా చదువు కోవాలని మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీ సోదరులు విదేశాల్లో చదువుకోడానికి వెళితే వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకంగా ఓవరసిస్ స్కాలర్షిప్ ల ద్వారా వారికి ఆర్థికంగా కూడా అండగా నిలవడం జరిగింది.

కేసీఆర్. అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తూ హిందువుల పండగ దసరా బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మైనార్టీ సోదరుల పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున విందు ఏర్పాటు చేసి, బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది తెలిపారు. ఎమ్మెల్యే. మైనార్టీల కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాల నియోజకవర్గం లోని కెసిఆర్. సహకారంతో షాది ఖానా భవనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో పవిత్రమైన రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఈ మాసంలో నిష్ట నియమాలతో భక్తిశ్రద్ధలతో దీక్షలను పాటించి ప్రపంచం శాంతిగా ప్రశాంతంగా అభివృద్ధి వైపుగా ఉండే విధంగా ఆ అల్లాను ప్రార్థించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, ఉమ్మడి జిల్లా కెటిర్ యువసేన ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ మోబిన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సీసాల పాషా, మన్సుర్, రెహమాన్ ఫయాజ్, అన్వర్, రిజ్వాన్, మోబిన్ ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.