ముదిరాజ్ ల అభ్యున్నతికి కృషి చేస్తా- జిల్లా కార్యదర్శి పొగుల నర్సయ్య

ముదిరాజ్ ల అభ్యున్నతికి కృషి చేస్తా- జిల్లా కార్యదర్శి పొగుల నర్సయ్య

ముద్ర, రుద్రoగి: తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శిగా రాజన్న సిరిసిల్ల జిల్లా  రుద్రoగి మండల కేంద్రానికి చెందిన పొగుల నర్సయ్య ముదిరాజ్, నియమించినట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కోడి అంతయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘట్‌ చంద్రగార్డెన్స్‌లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డా.బండ ప్రకాశ్‌ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొగుల నర్సయ్య మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో ముదిరాజ్ కుల అభ్యున్నతికి పాటూ పడుతానని అన్నారు.