జూలైలో 18 సినిమాలు.. ఆ మూడింటిపైనే అందరి ఫోకస్!

జూలైలో 18 సినిమాలు.. ఆ మూడింటిపైనే అందరి ఫోకస్!

జులై నెల.. బాక్సాఫీస్​కు  మంచి శుభారంభం దక్కలేదు. మొదటి వారంలో దాదాపు 11 చిత్రాల వరకు థియేటర్లలో రిలీజై సందడి చేశాయి. వాటిలో అవి చిన్న హీరోల సినిమాలు అని చెప్పలేము అలా అని పెద్ద హీరోలవి అని కాదు.  అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. నాగశౌర్య 'రంగబలి'  డిజాస్టర్ గా నిలిచింది.  దీంతో సినీ అభిమానులంతా రెండో వారంలో ఏఏ చిత్రాలు రిలీజ్ కానున్నాయా అని  ఆరా తీయగా... వీకెండ్ వచ్చేసరికి ఇంట్లో ఓటీటీలో వచ్చే సినిమాలు చూడాలా లేదా థియేటర్లకు వెళ్లాలా అని ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో జులై రెండు మూడు నాలుగు వారాల వరకు వచ్చే చిత్రాలేంటో చూసేద్దాం...

బైక్​తో విన్యాసాలు కదిలే ట్రైన్​పై కళ్లు చెదిరే ఫైటింగ్ లు చేయడం గాల్లోకి ఎగిరే విమానం నుంచి దూకే యాక్షన్ సన్నివేశాలు... ఇలా యాక్షన్ ప్రియుల్ని అలరించే హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నటించిన కొత్త సినిమా మిషన్ ఇంపాజిబుల్ జులై 12న విడుదలయింది. యాక్షన్​ సీక్వెన్స్ లు మెప్పించినప్పటికీ అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు బోర్​ ఫీలయ్యారు. అయితే ఈ సీక్వెల్​ ఏదైతే ఉంటదో దాన్ని మొదటినుంచి చూసిన ప్రేక్షకుడు శాటిస్​ఫై అవుతాడని చెప్పవచ్చు. మొదటిసారి చూసే వాళ్ళకి మొదటినుంచి సీక్వెల్​ మొత్తం ఫాలో అయ్యేవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. 

ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబి'.  సాయి రాజేశ్ దర్శకుడు. మంచి అంచనాలతో రానున్న ఈ లవ్ స్టోరీ జులై 14న విడుదల అయింది. ఈ చిత్రం అంతా ఓ కల్ట్​ కంటెంట్​ అని చెప్పవచ్చు. ఇది కేవలం యూత్​కి మాత్రమే నచ్చే సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఆర్​ఎక్స్​ హండ్రెడ్​ చిత్రమని కొంత మంది నుంచి వచ్చిన ఫీడ్​ బ్యాక్​. శివ కార్తికేయన్ అదితి శంకర్ జంటగా నటించిన సినిమా 'మా వీరన్' . మడోన్ అశ్విన్ దర్శకుడు. తెలుగులో 'మహా వీరుడు' పేరుతో జులై 14న విడుదలయింది. ఇక ఈ చిత్రం ఆశించినంతగా సక్సెస్​ కాలేదు. 

కీర్తి సురేష్ ఉదయనిధి స్టాలిన్ వడివేలు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో 'మామన్నన్'. సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని   మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. తెలుగులో 'నాయకుడు' పేరుతో  ఈ నెల 14న విడుదలయింది.  ఈ చిత్రం కీర్తి నటన వరకు ఓకే  అని చెప్పవచ్చు కానీ కథలో పెద్దగా దమ్ము లేదు. ఇక కీర్తి సురేష్​ వచ్చి ఇటు పెద్ద హీరోలతో సినిమాలను చేస్తూనే... లేడీ ఓరియంటెడ్​ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. శ్రీముఖ స్వీయ దర్శకత్వంలో దామాయణ (కన్నడ)తెరకెక్కింది. ఈ కామెడీ ఎంటర్​టైనర్​లో  ఆదిత్య అక్షయ్ వంటి యువ నటులు కీలకపాత్ర పోషించారు.భరత్ నందా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ నమస్తే ఘోస్ట్ (కన్నడ).. జులై 14న విడుదలయింది.  విద్యా రాజ్ కథానాయిక.షియాజీ షిండే మనోజ్ జోషి నటించిన క్రైమ్ డ్రామా అజ్మెర్ 92 (హిందీ). పుష్పేంద్ర సింగ్ దర్శకుడు.  జులై 14న విడుదలయింది. ఈ చిత్రం గురించి ఎక్కడా పెద్దగా టాక్​ కూడా వినిపించడం లేదు.

 

దిలీప్ జగపతిబాబు జూడ్ ఆంథోనీ జోసెఫ్ కీలక పాత్రల్లో నటించిన  కామెడీ థ్రిల్లర్ వాయిస్ ఆఫ్ సత్యనాథన్ (మలయాళం). దర్శకుడు  రఫీ తెరకెక్కించారు. జులై 14న విడుదలయింది.రోషన్ మాథ్యూ రవీనా రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వాలట్టి (మలయాళం). ఓ  శునకం నేపథ్యంలో ఈ కామెడీ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించారు. దేవన్ జయకుమార్ దర్శకుడు.అర్జున్ అశోకన్ కుంచకో బోబన్ నటించిన చావర్(మలయాళం) జులై 20న రానుంది. ఈ చిత్రానికి జాయ్ మాథ్యూ దర్శకత్వం వహించారు. మరి ఇది ఈ విధంగా ప్రేక్షకుడిని మెప్పిస్తుందో చూడాలి.హాలీవుడ్ చిత్రాలు ఓపెన్హెయిమర్ బార్బీ జులై 21న రిలీజ్ కానున్నాయి. అలాగే  సంజయ్ రావ్ హీరోగా ఎ.ఆర్.శ్రీధర్ తెరకెక్కించిన స్లమ్ డాగ్ హస్బెండ్  చైతన్య రావ్ లావణ్య జంటగా నటించిన 'అన్నపూర్ణ స్టూడియో'తో పాటు..  'డాక్టర్ సలీమ్'  'బిచ్చగాడు 2' ఫేమ్ విజయ్ ఆంటోని నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'హత్య' జులై 21నే రిలీజ్ కానున్నాయి.ఇక జులై 28 టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బ్రో'తో పాటు..  రణ్వీర్ సింగ్ అలియా భట్ జంటగా నటించిన 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' విడుదల కానున్నాయి.  జులై 29న 'రాజుగారి కోడి పలావ్' విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ప్రేక్షకుడి ఫోకస్​ అంతా బ్రో, రాకీఔర్​ రాణీ, రాజుగారి కోడి పలావ్​ మీద ఉంది మరి ఈ మూడు చిత్రాలన్నా కనీసం ప్రేక్షకుల్ని ఎంటర్​టైన్​ చేస్తాయేమో చూద్దాం.