రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి నాణ్యమైన ధర పొందాలి

రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి నాణ్యమైన ధర పొందాలి
  • జిల్లాలో 236 ధాన్యం  కొనుగోలు సెంటర్లు
  • రైతులు దళారుల నమ్మి మోసపోవద్దు
  • అదనపు కలెక్టర్ బి ఎస్ లత

తుంగతుర్తి ముద్ర:- రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందించే నాణ్యమైన ధర పొందాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతా అన్నారు.సోమవారం తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు, .జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇప్పటివరకు 72 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు. ఈనెల 15 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్ బాబు, తహసిల్దార్ రమణారెడ్డి,ఎంపీ ఓ భీమ్ సింగ్, ఏపీ ఓ నరసయ్య ,ఏవో బాలకృష్ణ, ఏ ఈ ఓ లక్ష్మీప్రసన్న ,లతోపాటు రైతులు పాల్గొన్నారు.