ప్రమాదవశాత్తు గన్ని బ్యాగులు దగ్ధం

ప్రమాదవశాత్తు గన్ని బ్యాగులు దగ్ధం

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- ప్రమాదవశాత్తు గన్ని బ్యాగులు దగ్ధమైన ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరు గ్రామంలోని రైతు వేదిక పక్కన ఉన్న ధాన్యం మార్కెట్ షెడ్ లో పిఎసిఎస్ కు సంబంధించిన 7000 గన్ని బ్యాగులు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమయ్యాయి. సగం పైగా కాలిన గన్ని బ్యాగులను అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి చూసి పిఎసిఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గ్రామపంచాయతీ నీటి ట్రాక్టర్ తో మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. అయితే షెడ్డు ఊరు చివరగా ఉండడంతో అప్పటికే పూర్తిగా కాలిపోయాయని తెలిపారు.వీటి విలువ సుమారు 3 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.