తాటి వనానికి ,ఈత వనానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

తాటి వనానికి ,ఈత వనానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

రామగిరి ముద్ర:రామగిరి మండలం జల్లారం సొసైటీ గౌడ సంఘం అయిన మూడు గ్రామాలు చెందిన చందనాపూర్ సింగిరెడ్డిపల్లి దుబ్బ పల్లె గౌడ కుటుంబాల ఆధారమైనటువంటి సొసైటీ తాటివనంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో  దాదాపు తాటి చెట్లు 100  ఈత  చెట్లు 100 పూర్తిగా మంటలు అంటుకోవడంతో చెట్లు బూడిద అయ్యాయి గౌడ సంఘం నాయకులు చింతల చంద్రయ్య ముత్యాల సంతోష్ తోడేటి శీను గట్టు శ్యామ్ సాయికుమార్ గౌడ కులస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు వేసవికాలం కావడంతో విపరీతంగా ఎండ వేడితో చెట్లు కు మంటలు మరింత ఎక్కువగా అంటుకోవడంతో ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పి వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాటివనానికి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని అలాగే గౌడ కులస్తులకు జీవనాధారమైన తాటి ఈత వనం పూర్తిగా దగ్ధం కావడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వెంటనే ప్రభుత్వం గౌడ కులస్తులను ఆదుకోవాలని మాజీ ఎంపిటిసి ఏలువాక ఓదెలు ప్రభుత్వాన్ని కోరారు.