అకాల వర్షం.. ..మొక్కజొన్న రైతుకు నష్టం

అకాల వర్షం.. ..మొక్కజొన్న రైతుకు నష్టం

పిడుగుపాటుకు కాడేడ్లు మృతి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు, పిడుగు పాట్లుతో ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్ మండలాల్లో మొక్కజొన్న రైతులకు నష్టం వాటిల్లింది. పిడుగుపాటుతో మల్కాపూర్ లో దుక్కిటేడ్లు మృత్యు వాత పడగా చెట్లు విరిగి రోడ్డుకి అడ్డంగా పడడం పలు రహదారుల పై రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి తర్వాత బలమైన గాలులతో భారీ వర్షం పడడంతో రెండు మండలాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంటలు నేల కోరిగాయి.

మల్కాపూర్ శివారులో పిడుగు పడడంతో చొప్పరి రాజుకు చెందిన దుక్కిటేడ్లు మృతి చెందడంతో దాదాపు రూ. 1 లక్షా 40 వేల నష్టం వాటిల్లింది. మల్కాపూర్ - తరిగొప్పుల ప్రధాన రోడ్డు పై చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో అర్ధరాత్రి నుండి ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు చెట్లను తొలగించడంతో రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి. అకాల వర్షంతో కొన్ని గ్రామాల్లో వరి ఫైర్లు, మిర్చి, టమాట, పుచ్చ తోటలు దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో ఏమేర నష్టం జరిగింది రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల నివేదికలో తెలియాల్సి ఉంది.