అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టాలకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టాలకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, పెద్ద వంగర తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నష్టాలను ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.

రైతులతో మాట్లాడి.. వారికి జరిగిన నష్టాల గురించి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి దైర్యం చెప్పారు. తొర్రూరు మండలం మడిపల్లి, చందూర్ తండా, మాటేడు, పోలే పల్లి తదితర గ్రామాల్లో మామిడి తోటలు నష్టపోయిన రైతులతో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. 

వడ్డే కొత్త పల్లి, పెద్ద వంగర, చిన్న వంగర, తదితర గ్రామాల్లో ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. అకాలవర్షం రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యలను తీసుకవెల్తామని, రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన పర్యటనలో ప్రజలకు దైర్యం చెప్పారు.